తెలంగాణ సర్కార్ సర్క్యూలర్ జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి… లెక్క ప్రకారం తొమ్మిదో రోజు అనగా ఈ నెల 29 సోమవారం రోజున సద్దుల బతుకమ్మను నిర్వహించాలని కొందరు అర్చకులు చెబుతున్నారు. మరోవైపు 30న నిర్వహించాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా ఆర్చకుల్లో నెలకొన్న ఈ సందిగ్దా న్ని రాష్ట్ర ప్రభుత్వం తొలిగించింది. 30వ తేదీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ నిర్వహించుకో వాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్క్కూలర్ జారీ చేశారు.