Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా 

అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి జోడు శ్రీనివాసును పోలీసులు అర్థరాత్రి సుమారు రెండు గంటలకు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తూ కాటారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్  అనంతరం ఆయన మాట్లాడుతూ… మా నాయకున్ని అన్యాయంగా అక్రమ అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ స్టేషన్ ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకుంటున్నారని ఇక పోలీసులు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని డ్యూటీలు చేయడమే తక్కువ అయిందని అన్నారు. పోలీసులు ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాటారం సిఐ మద్యం మత్తులో నా భర్తను కొట్టి అక్రమంగా తీసుకెళ్లాడు: జోడు రమ్య బీఆర్ఎస్ మండల ఇంచార్జి జోడు శ్రీనివాస్ భార్య
 అర్థరాత్రి కాటారం సిఐ మద్యం మత్తులో  మా ఇంటి వద్దకు వచ్చి నా భర్తను విపరీతంగా కొట్టాడు. దౌర్జన్యంగా  సీఐ పోలీస్ జీపులో ఎక్కించుకొని స్టేషన్కు తరలించాడు. సద్దుల బతుకమ్మ అని చూడకుండా  మా కుటుంబాన్ని అవమానించాడు. అని బీఆర్ఎస్ మండల ఇంచార్జి జోడు శ్రీనివాస్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -