- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూల నక్షత్రంతో పాటు, మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న సరస్వతి అమ్మవారిని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఎస్పీకీ ఆశీర్వచనలు అందించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆనంతరం మూల నక్షత్ర సందర్భంగా బాసరకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న భద్రత ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, బాసర, ముధోల్ ఎస్ఐలు శ్రీనివాస్, బిట్ల పెర్సిస్, తదితరులు ఉన్నారు.
- Advertisement -