నవతెలంగాణ – తుంగతుర్తి
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో తుంగతుర్తి మండల పరిధిలోని గ్రామాల్లో అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. సోమవారం ఎంపీడీవో శేషు కుమార్, తహసిల్దార్ దయానందం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు, ఇతరత్రాలకు సంబంధించిన ఫ్లెక్సీలను పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తొలగించారు.ఎన్నికల కోడ్ లో భాగంగా ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్లు ఎంపీడీవో శేషు కుమార్ పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సందీప్ కుమార్ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్.. ఫ్లెక్సీలు తొలగింపు: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES