వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2కే వాక్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మెడికవర్ హాస్పిటల్స్‌కి 2కే వాక్ నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రుక్మిణి చాంబర్స్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2కే వాక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఆందోళనకరమైన విషయం. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇలాంటి వాక్‌లు ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి చాలా ఉపయుక్తం అని తెలిపారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానంద రెడ్డి మాట్లాడుతూ..హార్ట్ ఎటాక్‌లు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమం తప్పని హెల్త్ చెక్-అప్స్, బరువు నియంత్రణ, జంక్ ఫుడ్ నివారణ, నియమిత వ్యాయామం, ధూమపానం–మద్యపానం దూరం పెట్టడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం అని తెలిపారు.
అదేవిధంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ..ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, రాత్రి నిద్రలేమి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల యువతలో హృదయ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం, పండ్లు–కూరగాయలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సూచించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ జగదీష్ చంద్ర బోస్, డాక్టర్ వారిస్ అలీ కూడా కార్యక్రమంలో పాల్గొని గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, యాజమాన్యం, హాస్పిటల్ ఇన్చార్జిలు స్వామి, వినయ్, సురేష్ సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
2కే వాక్ ద్వారా ప్రజలకు అవగాహన అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES