Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరూర్ తొక్కిసలాటలో ప్రశాంత్ కిషోర్ కుట్ర..

కరూర్ తొక్కిసలాటలో ప్రశాంత్ కిషోర్ కుట్ర..

- Advertisement -

– తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలి..
– ప్రశాంత్ కిషోర్ ఏ రాష్ట్రంలో అడుగు పెట్టినా ఏదో ఒక ఘటన
– ఎన్నికల వ్యూహాల పేరుతో ప్రశాంత్ కిషోర్ కుట్రలు
రాజబాబు
నేత డిమాండ్
నవతెలంగాణ – కాటారం 

తమిళనాడులోని కరూర్ లో టివికె పార్టీ రోడ్ షో లో జరిగిన తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని నేతకానీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ యువ నాయకులు రాజబాబు నేత అనుమానం వ్యక్తం చేశారు. కరూర్ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన  పత్రికా ప్రకటన విడుదల చేశారు. టివికె పార్టీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో విజయ్ పాత్ర లేదని అనిపిస్తోందన్నారు. కేవలం ప్రశాంత్ కిషోర్ సంచలనాల కోసమే ఈ ఘటనకు కారణం అయ్యుండొచ్చన్నారు. గతంలో ఎపిలో కూడా వైసిపి వ్యూహకర్తగా ఉన్న సమయంలో కోడికత్తి కుట్ర చేశారన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లోనూ కుట్ర రాజకీయాలకు కారణమయ్యాడన్నారు. వెంటనే ప్రశాంత్ కిషోర్ పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయా లబ్ది కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు అని, వారిని కాపాడుకోవడము ప్రతి పార్టీ బాధ్యత అని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -