Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అట్టహాసంగా విశ్వతేజస్ కార్యాలయం ప్రారంభం..

అట్టహాసంగా విశ్వతేజస్ కార్యాలయం ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన విశ్వతేజస్ స్వచ్చంద సంస్థ కార్యాలయాన్ని సోమవారం సాంధీపని విద్యాసంస్థల డైరెక్టర్ బి‌.బాలాజీరావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న విశ్వతేజస్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంబించడం ఆనందంగా ఉందన్నారు.సేవా కార్యక్రమాలను మరింత విసృతం చేయాలని విశ్వతేజస్ నిర్వాహకులకు సూచించారు.విశ్వతేజస్ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ.. తమ సంస్థ ఆద్వర్యంలో సేవాకార్యక్రమాలతో పాటు విద్యార్థులు, యువతకు వ్యక్తిత్వ వికాస శిక్షణనిస్తామన్నారు. పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్దం కావాలనే విషయమై ఉచితంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని‌ శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వతేజస్ ప్రతినిధులు వేదాంతం రంగనాథ్, జిల్కర్ విజయానంద్, విశ్వక్ సేన్, హన్మాండ్లు, చింతల గంగాదాస్, వీరబ్రహ్మం, ప్రసాద్, యాదేశ్ గౌడ్, నరహరి, మహిపాల్, తిరునగరి ప్రసన్న, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -