Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ..

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
అనర్హులకు కేటాయించిన డబల్ బెడ్ రూమ్లను రద్దుచేసి 81 మంది అర్హులకు ఇవ్వగా మిగిలిన ఇళ్లకు సర్వే చేయాలని సోమవారం సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినారు. పట్టణంలోని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్  ప్రజాపంథా కుమార్ నారాయణ్ భవనం నుండి అంకాపూర్ గ్రామ డబుల్  బెడ్ రూమ్ ల అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులకు కేటాయించాలని ర్యాలీ నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ.. మొదటి సర్వే లిస్టులో 81 మంది అర్హులలో కొందర్ని తొలగించి  21 మంది అనర్హులకు కేటాయించడం సరైంది కాదు అని అన్నారు. అదేవిధంగా అసలు అప్లై చేసుకోని వారికి కేటాయించడం సిగ్గుచేటని తక్షణమే వీటి పైన విచారణ  చేయాలని మొదటి సర్వే ప్రకారం 81 మందికి కేటాయించి మిగిలిన ఇళ్లకు  సర్వే చేసి అర్హులకు లబ్ధి చేకూర్చాలని పేర్ల మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మొదటి సర్వే లబ్ధిదారురాలు కుంచపు పద్మ మాట్లాడుతూ.. మొదటి నుండి ఇండ్ల పట్టాల కోసం పోరాటం చేసి ప్రగతి భవన్ ముట్టడిలో ఉన్నటువంటి వారినీ  కేసులకు గురైన మాలాంటి వాళ్లను పక్కనపెట్టి  ఇండ్లు , ప్లాట్లు ఉన్న  వారికి కేటాయించడం సరైనది కాదు అని వారు అన్నారు. సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా  కు వినతి పత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రజా పంద సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ ఏఐయుకేఎస్ నాయకులు లింబాద్రి , నిమ్మల నిఖిల్  , రఫీ ,తోకల పోశెట్టి సద్దాం, రాజామని, ఎత్తరి రాజు ,కొంచెం పద్మ గాండ్ల భోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -