Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌట్ పల్లిలో మహిళా వైద్య శిబిరం..

చౌట్ పల్లిలో మహిళా వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. స్వస్తి నారీ స్వశక్తి  పరివార్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన ఈ మహిళ వైద్య  శిబిరంలో మహిళ వైద్య నిపుణులు డాక్టర్ శ్వేతా, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్, దంత వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ చంద్ర పాల్గొని సేవలందించారు.

స్త్రీలలో వచ్చే సమస్యలకు డాక్టర్ శ్వేత వైద్య సేవలు అందించారు. మహిళలు ఆరోగ్యం విషయంతో తీసుకోవాల్సిన ఆహారం, పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ సతీష్ చంద్ర రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి  వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, పర్యవేక్షకురాలు స్వరూప, ఫార్మసిస్ట్ అరుణ్, ల్యాబ్ టెక్నీషియన్ పవన్, ఆసుపత్రి సిబ్బంది దుర్గా, దివ్య, మమత, విజయలక్ష్మి, శోభారాణి, ప్రసన్న, జయ, సుప్రియ, లక్ష్మి, రూప, గీత, శ్యామల, డిఇఓ మధు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -