- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలము పరిధిలోని శిరసనగండ్ల గ్రామానికి నూతన గ్రామ పాలన అధికారిగా (GPO) ఎట్టి రాజు బాధ్యతలు స్వీకరించారు. శిరసనగండ్ల లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల తహశీల్దార్ అద్దంకి సునీత, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి ప్రజలకు సేవలు మరియు పథకాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. గ్రామానికి సంబంధించిన పరిపాలన, ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తానని అన్నారు.
- Advertisement -