Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వల్పకాలిక రుణాలను సకాలంలో చెల్లించాలి..

స్వల్పకాలిక రుణాలను సకాలంలో చెల్లించాలి..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
స్వల్పకాలిక రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలను పొందాలని సొసైటీ చైర్మన్ శేషు గారి భూమారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రెంజల్ మండలం దూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ చైర్మన్ భూమా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. దీర్ఘకాలిక, స్వల్ప కాళిక రుణాలను చెల్లించి తిరిగి రుణాలను తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు బోనస్ ను ప్రకటించాలని ప్రభుత్వం కోరుతూ తీర్మానించారు.

కొత్తవారికి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీరియల్ ప్రకారమే వడ్ల కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైస్ మీ మిల్లులో రెండు కిలోల కంటే తరుగు ఎక్కువగా రాకుండా చూడాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిహెచ్ బాబన్న, పాలకవర్గ సభ్యులు ప్రతాప్ రెడ్డి, కాశం సాయిలు, ధనుర్ గంగాధర్, పల్లె సాయిలు, కూనేపల్లి రాజారెడ్డి, మైని రాజ్ కుమార్, శ్రీమతి ముళ్ళపూడి వరలక్ష్మి, సీఈవో జీవన్ రెడ్డి, ఎల్ సాయన్న, శ్రీ ప్రతాపరెడ్డి, వై లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -