నవతెలంగాణ – దుబ్బాక
త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని, జడ్పీటీసీ టికెట్ ను మాదిగలకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ అక్బర్ పేట భూంపల్లి మండలాధ్యక్షులు కాకి కొండల్, అంబేద్కరిస్ట్ బండమీది మల్లయ్య కోరారు. సోమవారం మండల పరిధిలోని నగరం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. నూతన మండలమైన అక్బర్ పేట భూంపల్లి కి ఎంపీపీ, జడ్పీటీసీ ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయినందునా.. అన్ని పార్టీలు మాదిగలకు జడ్పీటీసీ టికెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ టికెట్ ను ఇవ్వడమే కాకుండా వారి గెలుపులో భాగస్వామ్యం కావాలని కోరారు. మాదిగలను నిర్లక్ష్యం చేస్తే రాబోవు రోజుల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. వారి వెంట బొట్ల మోహన్, తడకపల్లి దశరథ్ కుమార్, గురజాల స్వామి, జీడిపల్లి రాజశేఖర్, సీహెచ్. శ్రీనివాస్, పలువున్నారు.
స్థానిక ఎన్నికల్లో మాదిగలకే జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES