– అత్యధికులు గిరిజనులే
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాలకులు మారితే విధానాలు మారతాయి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కల సాకారం కోసం మహిళాభివృద్ది పై దృష్టి సారించడం తో ఎందరో మహిళలు ప్రజాప్రతినిధులు కాబోతున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించింది. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట ఎంపిపి, జడ్పీటీసీ స్థానాలను ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. మొత్తం 11 ఎంపిటిసి స్థానాల్లో బీసీలకు 4,ఎస్టీలకు 5, జనరల్ కు 3 చొప్పున కేటాయించబడ్డాయి. వీటిలో అచ్యుతాపురం,నందిపాడు,వినాయకపురం ఎంపీటీసీ స్థానాలను ఎస్టీ జనరల్, గుమ్మడవల్లి, ఊట్లపల్లి స్థానాలను ఎస్టీ మహిళలకు, తిరుమలకుంట బీసీ జనరల్, కొత్తమామిళ్ళవారిగూడెం, నారంవారిగూడెం స్థానాలను బీసీ మహిళలకు, బచ్చువారిగూడెం, గాండ్లగూడెం స్థానాలను, జనరల్, నారాయణపురం జనరల్ మహిళకు కేటాయించారు.
గ్రామ పంచాయితీ సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు మొత్తం 27 గ్రామ పంచాయితీల్లో ఊట్లపల్లి బీసీ జనరల్, పాత అల్లిగూడెం జనరల్,కేసప్పగూడెం,అచ్యుతాపురం,ఆసుపాక, గుమ్మడవల్లి, కోయ రంగాపురం,మల్లాయిగూడెం, నందిపాడు, నారంవారిగూడెం, నారంవారిగూడెం కాలనీ, నారాయణపురం,పాత రెడ్డిగూడెం,వేదాంతపురం, గ్రామ పంచాయితీలు ఎస్టీ మహిళలకు మిగతా అచ్యుతాపురం, మద్దికొండ, జమ్మిగూడెం, కావడిగుండ్ల, కన్నాయిగూడెం, మొద్దులమడ, వినాయకపురం, తిరుమలకుంట, బచ్చువారిగూడెం, దిబ్బగూడెం, గాండ్లగూడెం, కొత్తమామిళ్ళవారిగూడెం, రామన్నగూడెం గ్రామ పంచాయితీలు ఎస్టీ జనరల్ కు కేటాయించారు. ఎంపీటీసీ సర్పంచ్ రిజర్వేషన్లను ఎంపీడీఓ అప్పారావు వెల్లడించారు.
కాబోయే సర్పంచుల్లో.. మహిళలు – మహా రాణులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES