Monday, September 29, 2025
E-PAPER
Homeఖమ్మండబుల్ బెడ్ రూంల ఏకపక్ష ఎంపిక

డబుల్ బెడ్ రూంల ఏకపక్ష ఎంపిక

- Advertisement -

– గ్రామసభ పెట్టకుండానే లాటరీ నిర్వహణ
– అర్హులకు మొండి చేయి
– సీపీఐ(ఎం) మండల కమిటీ ఖండన
– జిల్లా నాయకులు చిరంజీవి
నవతెలంగాణ – అశ్వారావుపేట

గ్రామ సభ పెట్టకుండానే లాటరీ నిర్వహించి గతంలో లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ కొత్తగా డబుల్ బెడ్ రూం లబ్ధిదారులను ఎంపిక చేయడం అన్యాయం అని సీపీఐ (ఎం) మండల కమిటీ తరపున జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ లు తీవ్రంగా ఖండించారు.  సోమవారం 11 గంటలకు స్థానిక ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఉదయాన్నే ఆగ మేఘాలు మీద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఓట్లు కోసమే నా అంటూ ధ్వజం ఎత్తారు. 

2015 – 2016 ఆర్ధిక సంవత్సరం లో మంజూరు అయిన గృహాలను ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో నిర్మించి 2019 – 2020 ఆర్ధిక సంవత్సరం రెవిన్యూ శాఖ కు అప్పగించారని,అనంతరం రెండు సార్లు దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా నేడు అడాహుడి ఎందుకని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఏమి చెప్తే అధికారులు అదే చేస్తారని మండల స్థాయి అధికారి వ్యాఖ్యానించడం విచారకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

అర్హులు నే లాటరీ తో  లబ్ధిదారులు గా ఎంపిక చేసారు – తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ

స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశాలు మేరకు గతంలో వచ్చిన దరఖాస్తు ల్లో అర్హులైన వారినే నేడు లాటరీ తో లబ్ధిదారులను ఎంపిక చేసాం అన్నారు.

డబుల్ బెడ్ రూం ల సమాచారం నాకేమీ తెలియదు – కమీషనర్ నాగరాజు
డబుల్ బెడ్ రూం లు సమాచారం నాకేమీ తెలియదని,లాటరీ తీస్తున్నాం అని తహశీల్దార్ రామక్రిష్ణ తెలిపారు. ఆ గృహాలు గతంలో నిర్మించారని, మున్సిపాల్టీ అయ్యాక కొత్తగా నిర్మాణాలు ఏమీ చేపట్టలేదని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -