Monday, September 29, 2025
E-PAPER
Homeబీజినెస్హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి చేయూత అందించిన కోరమాండల్

హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి చేయూత అందించిన కోరమాండల్

- Advertisement -

నవతెలంగాణ -కాకినాడ : ప్రముఖ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో కిచెన్-కమ్-డైనింగ్ హాల్‌ను నిర్మించింది, ఇది 100 మందికి పైగా పిల్లలు పరిశుభ్రమైన , ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ భోజనం చేయటానికి గౌరవప్రదమైన ప్రాంగణాన్ని సృష్టించింది.

ఈ డైనింగ్ హాల్ ను  కోరమాండల్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అమీర్ అల్వి, కాకినాడ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ త్రినాథ మరియు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ సమక్షంలో ప్రారంభించారు. కోరమాండల్ యొక్క సిఎస్ఆర్  కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా , తల్లిదండ్రుల మద్దతు లేని పిల్లలతో సహా హాస్టల్‌లో నివసిస్తున్న 100 మందికి పైగా పిల్లల జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ కొత్త సౌకర్యం పిల్లలందరూ ఒకేసారి కలిసి భోజనం చేయడానికి వీలు కల్పిస్తుంది, ఇది బలమైన సామాజిక భావాన్ని పెంపొందిస్తుంది , పరిశుభ్రత ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

ఈ కార్యక్రమంలో కోరమాండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు, వారు పిల్లలకు శానిటరీ కిట్‌లను పంపిణీ చేశారు. శ్రీ అల్వి మరియు కాకినాడ యూనిట్ హెడ్  శ్రీ సిహెచ్. శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పిల్లలతో సంభాషించి వ్యక్తిగతంగా కిట్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా  కోరమాండల్ ఇంటర్నేషనల్, ఫెర్టిలైజర్స్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అమీర్ అల్వి మాట్లాడుతూ, “ఈ డైనింగ్ హాల్ కేవలం మౌలిక సదుపాయాల కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది.  ఇది ఆనంద నిలయం పిల్లలకు ఆరోగ్యం, గౌరవం మరియు ఐక్యతకు మద్దతు ఇచ్చే ప్రాంగణం . పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం , వారికి మరింత సురక్షితమైన , ఆశాజనకమైన భవిష్యత్తుకు తాము దోహదపడుతున్నామని తెలుసుకోవడం చాలా సంతృప్తికరంగా ఉంది” అని అన్నారు. 

ఈ కార్యక్రమం,  అవసరమైన పిల్లలకు సురక్షితమైన, సహాయక వాతావరణాలను సృష్టించడంపై దృష్టి పెడుతూనే ,  సమాజ అభివృద్ధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ యొక్క  నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -