Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన అక్బర్ పేట భూంపల్లి జెడ్పీటీసీ బరిలో బోరం రాజేశ్వర్ 

నూతన అక్బర్ పేట భూంపల్లి జెడ్పీటీసీ బరిలో బోరం రాజేశ్వర్ 

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి 
నూతన అక్బర్ పేట భూంపల్లి మండల లో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరం రాజేశ్వర్ జెడ్పిటిసి బరిలో పోటీ చేస్తున్నట్టుగా తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం ఎన్నోసార్లు జైలు పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి నుండి తెలంగాణ ఉద్యమం తో పాటు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని టిఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని తెలిపారు. 2001 నుండి నేటి వరకు క్రియాశీలకంగా పరిచేశానని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి జడ్పిటిసి బీఫామ్ తీసుకొని జడ్పిటిసిగా పోటీ చేయడం జరుగుతుందని ఆయన సూచించారు. రిజర్వేషన్ సానుకూలంగా రావడంతో ఎస్సీ వర్గానికి చెందిన నాకు బీఫామ్ అందించేందుకు పార్టీ కృషి చేయాలని కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ కృషితో ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని కోరారు. అక్బర్ పేట భూపల్లి మండలంలోని ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెలు నాపై నమ్మకం ఉంచి సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -