నవతెలంగాణ – రెంజల్
గత మూడు రోజుల నుంచి ఎగువ భాగం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గోదావరి నుంచి వచ్చే వరద ఉధృతి వల్ల నీల గ్రామ శివారు లోని సుమారు 5వేల ఎకరాల పంట నీట మునిగిందని ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం అందజేయలేదని రైతులు పేర్కొన్నారు. ఎగువ భాగం నుంచి మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటి ఉధృతి రాగా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల 150000 క్యూసెక్కుల నీటిని వదలడం తో మండలంలోని సుమారు ఐదు కిలోమీటర్ల వరకు పంటలు నీట మునిగి గ్రామాలలోనికి వస్తున్నాయని వారు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఎగువ భాగం నుంచి వచ్చే వరద ఉధృతిని కిందికి వదలాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాతం యోగేష్, బీపీ గంగాధర్, గాండ్ల లక్ష్మణ్, సంతోష్, రాజేందర్, నజర్ , ఖాజా మొయినుద్దీన్ తో పాటు 50 మంది రైతులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.
అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందించిన నీలా గ్రామస్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES