Monday, September 29, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల తోపాటు మంథని నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. అలాగే దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని, ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట,పాటలతో  దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -