- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు రాష్ట్రమంతటా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ. సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనం. ప్రజల సాంస్కృతిక వైభవం, మహిళల ఐక్యతను చాటి చెప్తుంది. చెరువులు, కుంటలను రాష్ట్ర ప్రభుత్వం పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిస్తుంది’ అని తెలిపారు.
- Advertisement -