- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల ప్రజలకు పసర పోలీస్ స్టేషన్ సిఐ దయాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో కొండ్రెడ్డి చెన్నారెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను బందోబస్తులో భాగంగా సందర్శించారు. సందర్భంగా అక్కడున్న వారందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా ఎవరికి ఇబ్బంది లేకుండా బతుకమ్మ ఆడుకోవాలని సూచించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన పోలీసులను సంప్రదించవచ్చని సూచించారు. మహిళలంతా పేర్చిన పూల బతుకమ్మలతో ఆటలాడుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు.
- Advertisement -