నవతెలంగాణ – చారకొండ
గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా యువతకు అవగాహన చేస్తూ బైకు యాత్ర కొనసాగిస్తున్నట్లు సామాజిక కార్యకర్త, టీచర్ రాచకొండ ప్రభాకర్ అన్నారు. సెలవు దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా గల యువతకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛందంగా బైక్ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం బైక్ యాత్ర ద్వారా చారకొండ మండల కేంద్రం చేరుకొని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన యాత్ర ఇప్పటికి దాదాపు 1400 కిలోమీటర్లు పూర్తి చేశానని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసి యువతకు గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగి దుష్ప్రభావాలను తెలిపి, మేల్కొల్పడమే యాత్ర ప్రధాన ఉద్దేశం అన్నారు. యువతను చెడు వ్యసనాలకు డ్రగ్స్ కి బానిస కాకుండా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై, పౌరులపై ఉందన్నారు.
గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: టీచర్ ప్రభాకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES