- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం దుబ్బాక పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఆధ్వర్యంలో పోచమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టేజీ వద్ద మహిళలు, చిన్నారులు సంబరంగా బతుకమ్మ ఆడి పాడారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ఈ వేడుకల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్, సిబ్బంది, పట్టణ వ్యాపారులు, ఆయా కుల సంఘాల అధ్యక్షులు సభ్యులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు చిన్నారులు, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -