Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా ఆనంద్ కుమార్

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా ఆనంద్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా బాధ్యతలు ఎం. ఆనంద్ కుమార్ స్వీకరించారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 పోస్టులలో జిల్లాకు చెందిన ఆనంద్ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శనివారం నియామక పత్రం అందుకున్నారు. కలెక్టరేట్ సముదాయంలో ఉన్న ఆడిట్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధికారి విజయ్ కుమార్ కు నియామక పత్రం అందజేశారు. పదేళ్లుగా ఖాళీ ఉన్న అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ ఆనంద్ కుమార్ రాకతో భర్తీ అయినట్లయింది. గ్రూప్ 1 అధికారిగా విధుల్లో చేరడంతో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు అమృత్ కుమార్, దండు స్వామి, రమణ రెడ్డి, రంగ రత్నం, అరుణాచలం, ఎడిఈ అశోక్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ 1 అధికారి సతీమణి తేజస్విని, తల్లి దండ్రులు కరుణ, ఆనంద్, సన్నిహితులు నాయుడు రాజు, అందె నవీన్ కుమార్, దేవ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -