- Advertisement -
నవతెలంగాణ-పెద్దవంగర
తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలను మండల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగాయి. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఉంచి మహిళలు ఆడి పాడారు. కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామాల్లోని పొలిమేరల లో ఉన్న చెరువుల్లో బతుకమ్మ నిమజ్జనం చేశారు. అనంతరం వాయినాలు పంచుకొని సల్లంగా చూడు బతుకమ్మ అంటూ ఇంటికి వెనుదిరిగారు. ఎస్సై క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
- Advertisement -