Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తగ్గిన జీఎస్టీ బోర్డులు ప్రతి దుకాణంలో ఏర్పాటు చేయాలి..

తగ్గిన జీఎస్టీ బోర్డులు ప్రతి దుకాణంలో ఏర్పాటు చేయాలి..

- Advertisement -

కొడారి వెంకటేష్.. వినియోగదారుల సంఘం అధ్యక్షులు
నవతెలంగాణ – భువనగిరి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం, వివిధ వస్తువులపై తగ్గించిన జీఎస్టీ వివరాలను తెలిపే బోర్డులను అన్ని దుకాణాల్లో ఏర్పాటు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని  పలు ( ప్రిన్స్ మెడికల్ హాల్, అపోలో ఫార్మసీ) దుకాణాలను సందర్శించి, తగ్గించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) బోర్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం  సుమారు 400 రకాల వస్తువుల పై తగ్గించిన జీఎస్టీ, సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన  కారణంగా పాత నిల్వ ఉన్న వస్తువులను దుకాణదారులు తగ్గించిన జీఎస్టీ ప్రకారమే అమ్మకాలు జరుపాలని, లేనిచో వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్  1915, లేదా వాట్సాప్ నెంబర్  8800001915  కి పిర్యాదు చేయాలని ఆయన కోరారు. పిర్యాదు చేసిన వివరాలు కేంద్ర ప్రభుత్వానికి చేరుతాయని ఆయన అన్నారు. పాత స్టాక్ విషయంలో వచ్చే నష్టాన్ని దుకాణాల యజమానులు లేదా కంపెనీ యాజమాన్యాలు భరించాలని ఆయన అన్నారు. ప్రతి రోజు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, తగ్గిన జీఎస్టీ  వివరాలు తెలుసుకొని,  తగ్గిన జీఎస్టీ  ప్రకారం వస్తువులను కొనుగోలు చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -