Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనువాదాన్ని వ్యతిరేకిద్దాం..

మనువాదాన్ని వ్యతిరేకిద్దాం..

- Advertisement -

ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ – భువనగిరి

మహిళలను అణిచివేసే మనువాదాన్ని వ్యతిరేకిద్దాం. మహిళ హక్కుల కోసం ముందుకు సాగుదామని అనే నినాదంతో ఐద్వా ముందుకు పోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ తెలిపారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ ఆవరణలో ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ మండలాల్లో బతుకమ్మ సంబరాలు ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని బానిస కాలం నాటి ఆలోచనలు ప్రేరేపిస్తున్న మనువాదాన్ని వ్యతిరేకించాలని మహిళల హక్కుల సాధనకు మహిళలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

బతుకమ్మ పండుగ మన సాంస్కృతి, ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతికగా తీరక్క పూలతో మన జీవన సాంస్కృతిని తెలియపరిచే విధంగా పండుగల్లో మహిళలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఒకప్పుడు బతుకమ్మ పండుగ భూస్వాముల గడీలలో ఆడే పండుగను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో ఆంధ్ర మహాసభ పిలుపుతో మల్లు స్వరాజ్యం లాంటి అనేకమంది మహిళలు అన్ని వర్గాల ప్రజలలో తీసుకుపోవాలన్నారు. ఈ పండుగను గ్రామాలలో లలో వాడవాడలలో ఆడించారు అని అన్నారు తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించడం  ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి భువనగిరి పట్టణ కార్యదర్శి కల్లూరి నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు పట్టణ అధ్యక్షురాలు మాయ రాణి, పట్టణ కోశాధికారి గంధ మల్ల బాలమణి,  పట్టణ సహాయ కార్యదర్శి మాటూరి కవిత, ఎన్ పి ఆర్ డి జిల్లా నాయకురాలు కొత్త లలిత, ఐద్వా నాయకురాలు వల్దాసు జంగమ్మ, గడ్డం వాణి, వడ్డెబోయిన స్వప్న, గద్దె లత, మంగమ్మ, ఎస్ లావణ్య, శోభ, ప్రీతి, ప్రశాంతి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -