Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభువనగిరిలో నకిలీ నోట్ల కలకలం.. 

భువనగిరిలో నకిలీ నోట్ల కలకలం.. 

- Advertisement -

పోలీసులకు ఫిర్యాదు..
నవతెలంగాణ – భువనగిరి

భువనగిరి పట్టణంలో నకిలీ నోట్ల కలకలం చర్చనీయంశమైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని ఖిలా నగర్లో పల్లెర్ల నాగేంద్రబాబు, మొబైల్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 11:29 నిమిషాలకు అతని వద్దకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన దగ్గర రూ. 11 వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఆ మొబైల్ షాప్ ఓనర్ తన యొక్క ఫోన్ పే ద్వారా అతను చెప్పిన నెంబర్కు ఫోన్ పే చేశారు. తర్వాత ఆ వ్యక్తి ఇచ్చినటువంటి రూ. 11000 (500 నోట్ లను) నగదును తీసుకున్నారు. అ తర్వాత చెక్ చేయగా అవి నకిలీవని తెలిసింది. ఈ నకిలీ నోట్లనునిజమైన నోట్లుగా నమ్మబలికి మార్చినటువంటి వ్యక్తి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -