నవతెలంగాణ – ఉప్పునుంతల
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ స్వప్న మాట్లాడుతూ.. “బతుకమ్మ పండుగ మన తెలంగాణ మహిళల ఆత్మీయ పండుగ. ఇది మన సంప్రదాయాలకే కాదు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక” అని పేర్కొన్నారు.
మహిళా సిబ్బంది పూలతో బతుకమ్మను అలంకరించి, కేంద్రం ఆవరణలో ఆడుతూపాడుతూ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ స్వప్న, ఎంపీహెచ్వో మధు నాయక్, నర్సింగ్ ఆఫీసర్ ఉఫత్, సూపర్వైజర్ ప్రభావతి, ఫార్మసీ ఆఫీసర్ కుమారాచారి, ఎంఎల్ఎచ్పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.