నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు లక్కవత్రి నారాయణ 55 ఈనెల 11న గుండెపోటుతో మృతి చెందారు. నారాయణ భార్య లక్కవత్రి లక్ష్మికి డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా తరపున 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అంద చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు లోకని గంగారం మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా డిచ్ పల్లి లో వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడని ఆయన మృతి పోటీ జర్నలిస్టులకు తమకెంత గానో లోటన్నారు. నారాయణ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆర్థిక సహాయం అందించిన వారిలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సామల మురళి, ఉపాధ్యక్షులు జలగడుగుల సాయిలు, కోశాధికారి సయ్యద్ నయీమ్, సభ్యులు గోపాల్, కట్ట శోభన్ బాబు, వసంతరావు తదితరులున్నారు.
జర్నలిస్టు నారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES