ఊహకందని పరిణామాల వెల్లువలో
జీవన గతులు పరుగులెడుతున్నాయి
అంతుచిక్కని పరీక్షల జీవితంలో
జవాబు దొరకని పరిస్థితి తలెత్తింది
అమ్మలగన్నయమ్మ బతుకమ్మా
మా బతుకుల్లో వెలుగు నింపవమ్మా
రైతు లోకం కష్టాల సంద్రంలో
ఈదలేక అలసిపోయి ఇరక్కపోయింది
ఆర్థిక వ్యవస్థకు గ్రహణనీడ కమ్మి
నష్టాల ఊబిలో కూరుకుపోయింది
రాజ్యమంతా కీడు వ్యాపించి
దుర్గంధంలో ప్రజానీకం మునిగింది
మా జీవన జ్యోతివి నీవే బతుకమ్మా
కరుణించి కాపాడి మమ్మేలవమ్మా
చేతి వాటాల రాపిడిలో
మధ్య తరగతి కరిగిపోతోంది
ఉన్మాదపు పడగ నీడలో లోకం
భయపడుతూ బతుకు సాగిస్తోంది
నేరాల మాంత్రిక మాయాజాలంతో
అవినీతి అనకొండలా పెరిగిపోతోంది
దీవించే తల్లివి నీవు కాపాడవమ్మా
పాప బీతి తొలిగించి బతికించవమ్మా
పైపై మెరుగుల తొడుగులతో
సమాజం మోసపోతూ ఏడుస్తోంది
బడుగులను బలహీనత పీడిస్తోంది
ఆడబిడ్డల సంరక్షణ మరుగైపోతోంది
నడవాల్సిన పాలన కుంటుతోంది
అమ్మా బతుకమ్మా దయగనవమ్మా
హెచ్చుతగ్గుల నుంచి రక్షించవమ్మా
- నరెద్దుల రాజారెడ్డి,
9666016636