Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసాగర్‌ 26 క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటి విడుదల

సాగర్‌ 26 క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు సోమవారం రాత్రి 6,25,810 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాంతో సాగర్‌ డ్యామ్‌ 26 క్రస్ట్‌ గేట్లలో 18 గేట్లను 15 అడుగుల మేరకు, 8 గేట్లు 20 అడుగుల మేరకు ఎత్తి 5,76,284 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువ ద్వారా 9533 క్యూసె క్కులు, ప్రధాన జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 33,211 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి వస్తున్న వరద ఉధృతంగా రావడంతో నీటి విడుదలతో డ్యామ్‌ దిగువ భాగాన ఆంధ్రా ప్రాంతంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి.

సింగూర్‌కు వరద 11 గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల
సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని సింగూర్‌ ప్రాజెక్టుకు రోజురోజుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి సోమవారం 1,10,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 11 గేట్లు ఎత్తి 1,06,137 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు ప్రాజెక్టు డీఈ బీమ్‌ తెలిపారు. కాగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 18.324 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. అందులో జెన్కోకు 1376 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, తొమ్మిదేండ్ల తర్వాత 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -