Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొనసాగుతున్న గోదావరి ఉధృతి

కొనసాగుతున్న గోదావరి ఉధృతి

- Advertisement -

– అమల్లో మొదటి ప్రమాద హెచ్చరిక
– విలీన మండలాల్లో 35 గ్రామాలకునిలిచిన రాకపోకలు
భద్రాచలం:
వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన కొన్ని గంటల్లోనే భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 44.80 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 11.70 అడుగులకు వరద తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహ రించారు. ప్రస్తుతం ఇక్కడ వరద స్థిరంగా ఉంది. బ్యారేజీకి చెందిన 175 గేట్లకు పైకి ఎత్తి 9,59,784 క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం కనకాయలంక, మామిడి కుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే, అయినవిల్లి మండలంలో ఎదురుబిడెం కాజ్‌వేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, పి.గన్నవరం మండలం బూరుగులంక, అరిగెలవారిపేట, ఊడుమూడిలంక, జి.పెదపూడిలంక, ఆచంట మండలం పెదమ ల్లంక, అనగాలంక, అయోధ్యలంక, మర్రిమూల గ్రామాల ప్రజలు, అయినవిల్లి మండలంలో పల్లపులంక, వీరవల్లిపాలెం, శానిపల్లిలంక ప్రజలు మర పడవలపై కాజ్‌వేలను దాటుతున్నారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వాగులు పొంగడంతో సుమారు 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి మరింత పెరుగుతుందనే అధికారుల హెచ్చరికలతో విలీన మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -