Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

నవతెలంగాణ-ఆర్మూర్‌
అధిక వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ.. అధిక వర్షాలు, వరదలతో ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటంతా నీటమునిగి.. ఇసుక మేటలు వేసిందని అన్నారు. రైతులు పెట్టుబడి పెట్టి నెల రోజుల్లో చేతికి వచ్చే సమయానికి పంటంతా నష్టపోయి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, కూరగాయలు అధిక వర్షాల వల్ల నీట మునిగి రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నీ రకాల పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి నల్లగా రంగు మారాయని, దాంతో తక్కువ ధరకు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షకాలం వరి పంట కోతకు వచ్చిందని.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను వెంటనే రైస్‌ మిల్లుకు తరలించి రైతులకు నష్టం రాకుండా చూడాలని కోరారు. వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు, డ్రయినేజీలకు మరమ్మత్తులు చేపట్టాలని, వర్షానికి పురాతన ఇండ్లు కూలిపోయిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేయాలని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తొగటి భూమన్న, సీఐటీయూ మండల కన్వీనర్‌ కుతాడి ఎల్లయ్య, రైతులు శేపూర్‌ సాయన్న, ఆలకుంట సాయిలు, చిన్నయ్య, ఎల్లయ్య, గుండేటి శంకర్‌, ఓంకార్‌, గంగారం, విడగొట్టి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -