Tuesday, September 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్దసరా పండుగ రోజు మాంసం దుకాణాలు బంద్

దసరా పండుగ రోజు మాంసం దుకాణాలు బంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగర ప్రజలకు, నాన్ వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ కాగా.. ఆ రోజే గాంధీ జయంతి కూడా కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని విభాగం 533(B)తో పాటు ఈనెల 24న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇందుకు అధికారులు సహకరించాలని, మాంసం దుకాణాలు తెరువకుండా పర్యవేక్షణ చేపట్టి.. గాంధీజీ పవిత్రతను కాపాడాలని సూచించింది. దీంతో పండుగ రోజున ఇదేంటంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. గాంధీ జయంతి రోజే పండుగ రావడంతో మాంసం దుకాణాలు మూసివేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -