నవతెలంగాణ – హైదరాబాద్: సిటీలో శాంతి భద్రత కాపాడటమే మా మొదటి కర్తవ్యం అని కొత్త సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. మంగళవారం ( సెప్టెంబర్ 30) న హైదరాబాద్ సిటీ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో సజ్జనార్ మాట్లాడారు. సిటీలో శాంతి భద్రతలు కాపాడటమే మా మొదటి కర్తవ్యం అన్నారు సీపీ సజ్జనార్. డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్ మత్తు వదిలిస్తామన్నారు.
సైబర్ కేటుగాళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు సీపీ సజ్జనార్. డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు.. ప్రజలు సైబర్ మోసాగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ క్రైం కట్టడికి మరిన్న చర్యలు చేపట్టనున్నట్లు సీపీ చెప్పారు. ఆన్ లైన్ బెట్టింగ్, ఫేక్ యాప్ పై నిఘా పెంచుతామన్నారు సీపీ. సిటీలో మహిళ భద్రతకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తామన్నారు. డ్యూటీలో పోలీసులు మరింత అలెర్ట్ గా ఉండాలని కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
హైదరాబాద్‌లో నేరాల కట్టడికి అనేక చర్యలు చేపడతాం. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల యువత బాగా చెడిపోతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌నకు ప్రమోషన్ చేయవద్దని వీఐపీలను కోరుతున్నా. డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే కాల్స్‌ను నమ్మవద్దు. అరుదైన వ్యాధులకు ఔషధాలు అంటూ చేసే మోసాలూ పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ మోసాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కల్తీ ఆహరంపై ప్రతేక దృష్టి పెడతాం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి కల్తీ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.