Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంగారుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

బంగారుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బంగారు పల్లి గ్రామం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా మోడల్ గ్రామంలో ప్రభుత్వం గుర్తించింది. శుభాకాంక్షలు మంగళవారం నాడు జుక్కల్ ఎంపీడీవో శనివాస్ ఇందిరమ్మ పథకం నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ లబ్ది  దారులతో సమస్యల గురించి మాట్లాడారు. గ్రామంలో పడితే రెండు గృహ నిర్మాణాలు పూర్తి దశలో చేరుకున్నాయని గృహప్రవేశ కార్యక్రమాలను సిద్ధంగా తయారయ్యాయని తెలిపారు. అదేవిధంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన ప్రభుత్వము అందించే నిర్మాణ బిల్లులు,  ఖర్చులు అందినాయా? లేదా? అని లబ్ది దారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తించిన స్థలంలోని కొలతల ప్రకారం నిర్మాణాలు చేయాలని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ కానీ , తక్కువ కానీ నిర్మాణం చేస్తే వాటికి బిల్లులు మంజూరు కావాలని తెలియజేశారు. మంజులైన ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు పరిగెత్తిన నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. గృహ నిర్మాణాల పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి , గ్రామ పెద్దలు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -