- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మరికొద్దిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది. అక్టోబర్ ఒకటిన బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
- Advertisement -