వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ గా హేమంత్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల కు డాక్టర్ జె.హేమంత్ కుమార్  పదోన్నతిపై నూతన అసోసియేట్ డీన్ గా నియమించిన విషయం పాఠకులకు విదితమే. కళాశాల పూర్వ అసోసియేట్ డీన్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ సంగారెడ్డి కాలేజి ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో అగ్రానిమి డిపార్ట్ మెంట్ కి ప్రొఫెసర్ గా బదిలి చేయబడ్డారు.ఈ సందర్భంగా కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది,విద్యార్ధిని విద్యార్థులు సమక్షంలో డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ కు వీడ్కోలు పలికారు.ఆ తరువాత కొత్తగా వచ్చిన అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్ కుమార్  నూతన అసోసియేట్ దీన్ గా బాధ్యతలు స్వీకరించారు.జె. హేమంత్ 1990 వ సంవత్సరం  విద్యార్థిగా ఈ కళాశాల తో 1994 లో వ్యవసాయ విద్యలో పట్టా చేపట్టారు.కృషి విజ్ఞాన్ కేంద్రం, వైరా లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా 7 సంవత్సరాలు పని చేశారు.ఆయన ఆద్వర్యంలో 2019 లో జాతీయ స్థాయి “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహ పురస్కారం” కృషి విజ్ఞాన కేంద్రానికి లభించింది. 2018 లో “ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం” అవార్డు లభించింది. స్వతహాగా ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు.  2017 లో రాష్ట్ర స్తాయి ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్త అవార్డ్ లభించింది. 2016 లో జిల్లా స్తాయి ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు లభించింది.  ఈ రోజు కళాశాలను ఉద్దేశిస్తూ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అది సాధించటానికి ప్రతి ఒక్క బోధన సిబ్బంది ఎంతో కృషి చేయాలని కోరారు  కళాశాలలోని బోధన బోధనేతర అంశాలతో పాటు క్షేత్ర స్తాయి కార్యాచరణలో నూతన ఒరవడిని తీసుకురావాలని కళాశాల సిబ్బందికి కార్యనిర్ధేశకాలు చేశారు.
Spread the love