నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప మంగళవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఈయన బిచ్కుంద మండల కేంద్ర నివాసులు మద్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, మండలాలు ఉన్నప్పుడు ఈయన మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా రెండు దఫాలుగా పదవి నిర్వహించారు. ఒకసారి 1992 నుండి 1994 వరకు చైర్మన్ బాధ్యతలు చేపట్టగా.. మరోసారి 2005 నుండి 2008 వరకు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మల్లికార్జున అప్ప బాధ్యతలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గుండె పోటు వచ్చి హఠాన్మరణం చెందడంతో మద్నూర్ మార్కెట్ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన మరణం పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లికార్జున్ అప్ప హఠాన్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES