- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని దుర్గామాత మండపంలో మంగళవారం నిర్వహించిన మహిళల మహోత్సవ ప్రత్యేక పూజలో నేను సైతం అంటూ మతసామరస్యాన్ని ముస్లీం మహిళ చాటుకున్నారు. మండపంలో గంటసేపు జరిగిన పూజల్లో ఆమె హిందూ మహిళలతో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత ప్రసాదాన్ని స్వీకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా హిందూ మహిళలతో పాటు నేను సైతం దుర్గామాతకు పూజ చేస్తానంటూ పాల్గొనడం గ్రామస్తులను ఆశ్యర్యపరిచింది. ముస్లిం మహిళ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నందుకు హిందూ మహిళలంతా ఆమెను అభినందించారు.
- Advertisement -