- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలు కామారెడ్డి కి శుక్రవారం వచ్చిన సందర్భంగా వారిని షబ్రాల నివాసంలో కలిసి రవాణా శాఖ అధికారులు తమ సమస్యలు మంత్రికి విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని రవాణా శాఖ అధికారులకు హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -