గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు
నవతెలంగాణ – చండూరు
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు తెలిపారు. మంగళవారం స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో 22వ నెల నిత్యావసర సరుకులను పేదలకు పంపిణీ చేసి మాట్లాడారు. మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ.. సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని అన్నారు.
గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ లభించదని అన్నారు. మా గాంధీజీ విద్యాసంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కోడి ప్రీతి, కోడి శృతి, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.