- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల బండారి విజయలక్ష్మి ఆసుపత్రిలో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. బండారి విజయలక్ష్మి ఆస్పత్రిలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన బతుకమ్మలతో వేడుకలను వైద్యులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి విజయలక్ష్మి ఆసుపత్రి వైద్యురాలు సుజాత, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగమోహన్లు మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -