Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా దుర్గాదేవి మండలంలో కుంకుమ పూజలు

ఘనంగా దుర్గాదేవి మండలంలో కుంకుమ పూజలు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలం జాగీర్యాల గ్రామంలో వెలిసిన అమ్మవారి ముందు దుర్గ భవాని స్వాముల వారి ఆధ్వర్యంలో దుర్గాదేవి మండపంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 250 మంది ఆడపడుచులు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమం దాదాపు గంటకు పైగా సమయం తీసుకున్న అందరూ ఉపవాస దీక్షతో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుంకుమార్చన కార్యక్రమానికి వచ్చినవారు పురోహితులు చెప్పిన విధంగా మంత్రాల ఉచ్చరణతో భక్తిపార్వశంతో మునిగిపోయారు. గ్రామ పురోహితులు రామకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది.ముందుగా గణపతి పూజ,పుణ్యహ వచనం, మండపారాధన, అమ్మవారికీ పాలు, పంచదార, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకలు నిర్వహిచారు.

కుంకుమార్చన పూజ ఎక్కడైనా ఒకరు లేదా ఇద్దరితో చేయిస్తారు కానీ ఇక్కడ మాత్రం గ్రామ ఆడపడుచులు మొత్తం దేవుని సన్నిధిలో కుంకుమార్చన చేసుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని అందరూ పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ప్రతి ఏటా నిర్వహించే కుంకుమ పూజ కార్యక్రమం దుర్గా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తునందుకు కుంకుమ పూజ నిర్వహిస్తునందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అర్చన పూజలో కూర్చున్న ఆడపడుచులు తమ అభిప్రాయం తెలపడం జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఇలాగే కుంకుమ పూజ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మండప నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గాదేవికి కుంకుమ పూజ చేసారు. జాగీర్యాల గ్రామ ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో లలిత సహస్ర నామాలు, భజనలు చేశారు. అనంతరం అన్న ప్రసాదం చెప్పట్టారు.దగ్గరుండి కుంకుమార్చన కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేలా దగ్గరుండి చూసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -