Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు 

పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణములోని 2వ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్ హనుమాన్ మందిర అభివృద్ధి కమిటీ, చేనేత కాలనీలలో వందేమాతరం యూత్ ఆధ్వర్యములో మంగళవారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథిగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, స్థానిక మున్సిపల్ మాజీ  కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ విచ్చేసి మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణాలో బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్  నాయకులు ఖాందేష్ సత్యం, హనుమాన్ మందిర అభివృద్ధి కమిటీ అద్యక్షులు అంబల్ల తిరుపతి, మాజీ అధ్యక్షులు మానకొండూరు భాస్కర్, ప్రధాన కార్యదర్శి నూకల శేఖర్, కోశాధికారి కర్తను నవీన్, ప్రతినిథులు రవీందర్ రెడ్డి, రోహిత్, ప్రవీణ్, విజయ్, భరత్ మరియు వందేమాతరం యూత్ సభ్యులు అక్షయ్, గోక శరత్, బోగ గిరీష్, సదమస్తుల విష్ణు, సందీప్, అంబల్ల ధర్మవిర్, దామోదర్, సత్యనారాయణ, ప్రవీణ్ తదితర కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -