నవతెలంగాణ-హైదరాబాద్ : మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని లండన్‌లోని భారత హై కమిషన్ తీవ్రంగా ఖండించింది. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో ఉన్న గాంధీ స్మారక విగ్రహాన్ని సొమవారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. కూర్చున్న భంగిమలో ఉన్న గాంధీ విగ్రహం స్తంభంపై పిచ్చిరాతలు రాశారు. ఈ చర్యను సిగ్గుచేటుగా భారత హైకమిషన్ పేర్కొంది. తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మారక చిహ్న గౌరవాన్ని పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నామని, ఈ అపవిత్రతపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ సిగ్గుచేటు చర్యను ఖండిస్తున్నామని, తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని లండన్‌లోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదని, అహింస భావనపై, మహాత్ముని వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా పేర్కొంది.
లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లోని ఈ స్మారకచిహ్నం వద్ద అక్టోబర్ 2న ప్రతి ఏడాది ప్రజలు నివాళులు అర్పిస్తుంటారు. విధ్వంసానికి సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని మెట్రోపాలిటన్ పోలీసులు మరియు స్థానిక కామ్డెన్ కౌన్సిల్ అధికారులు తెలిపారు.
లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత హైకమిషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES