బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ కొమ్రెవార్…
నవతెలంగాణ – కుభీర్
స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేయాలని ఆ పార్టీ నాయకుడు కిరణ్ కొమ్రెవార్ అన్నారు. మంగళవారం కుభీర్ లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కొమ్రెవార్ మాట్లాడుతూ.. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్లలో దీటైన అభ్యర్థులను ఎంపిక చేసి వారి గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆరు గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలోవ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రేకులు గంగ చరణ్, నాయకులు లోలం శ్యాంసుందర్,మండల బిఆర్ ఎస్ అధ్యక్షులు ఎన్నిల అనిల్, మాజీ వైస్ ఎంపీపీ మొహీనుద్దీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES