నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రనికి చెందిన పాట రచయిత కొత్తపల్లి సాగర్, ఉప్లూర్ గ్రామానికి చెందిన సుంకరి విజయ్ నిర్మించిన కొలమ్మ కోలో…బతుకమ్మ కోలో పాట పోస్టర్ కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఐ అనిల్ రెడ్డి, మండల విద్యాధికారి ఆంధ్రయ్య,ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్ లతో కలిసి పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పండుగ అన్నారు. బతుకమ్మ పండుగ ప్రజల జీవన విధానంలో భాగమైన, మమైకమైన పండుగ అని, ప్రకృతిని ఆడపడుచులను ఆరాధించే పండుగ అన్నారు.
అలాంటి పండుగపై పాటను రచించి నిర్మించిన రచయిత, సింగర్ సాగర్, నిర్మాత విజయ్ కుమార్ కు హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.పాటలో సాహిత్యం, మేకింగ్ అద్భుతంగా ఉందని ఈ పాట ఖచ్చితంగా విజయవంతం అవుతుందని తెలిపారు.అందరూ కూడా నైని ట్యూన్ యు ట్యూబ్ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని పాటను, కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.రానున్న రోజుల్లో ఇంకా మంచి సమాజానికి ఉపయోగపడే పాటలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఐకెపి సీసీలు రవి,భాగ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
కొలమ్మ కోలో… బతుకమ్మ కోలో పాట ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES