నవతెలంగాణ – నవీపేట్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నవీపేట్ మండలంలోని ఎంపిటిసి, జెడ్పిటిసి, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సీపీఐ(ఎం) అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల నగర మోగిన సందర్భంగా సీపీఐ(ఎం) సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీగా సీపీఐ(ఎం) అనేక త్యాగాల గుర్తింపు ఉందని అన్నారు. ఎందరో నాయకులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు.
ప్రస్తుతం బిజెపి పాలనలో దేశం అభివృద్ధి కాకపోగా మోడీ ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. హిందూ, ముస్లిం రాజకీయాలు తప్ప పేద ప్రజలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. నవీపేట్ మండలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారం పేదలకు భూములు, ఇండ్లు ఇప్పించడంలో ముందుందని అన్నారు. ప్రజల కోసం అధికారం ఉన్న లేకపోయినా ప్రజా సమస్యలపై ప్రజా పోరాటాలు చేస్తూ పనిచేస్తామని అన్నారు. కాబట్టి ప్రజలు సీపీఐ(ఎం) అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు దేవేందర్ సింగ్, వసంత్, మహబూబ్ అలీ, సావిత్రి షమీన తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో నవీపేట్ లో సీపీఐ(ఎం) పోటీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES