Tuesday, September 30, 2025
E-PAPER
Homeక్రైమ్కామరెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం..

కామరెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -

– హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమం
నవతెలంగాణ – పరకాల

పరకాల మండలం కామరెడ్డిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్‌, గొర్ల కాపరి పాలకుర్తి సాంబయ్యలు తీవ్ర గాయాలపాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పరకాలలో విధులు ముగించుకొని స్వగ్రామం శాయంపేట మండలం పత్తిపాక వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్ బైక్‌ ను, తహరాపూర్ నుండి పరకాల వైపు వస్తున్న లారీ కామరెడ్డిపల్లె ఎస్బిఐ బ్యాంకు వద్ద  ఢీకొట్టింది. గొర్రెల గుంపును తప్పించబోయిన క్రమంలో గొర్రెల కాపరి పాలకుర్తి సాంబయ్యను తాకి పరకాల నుండి పత్తిపాక వైపు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్ బైకును లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ  ప్రమాదంలో రవీందర్‌, గొర్రెల కాపరి సాంబయ్యలు తీవ్రంగా గాయపడ్డారు.త క్షణమే గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరకాల ఎస్ఐ విఠల్ సందర్శించి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -